సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న (72) మరణించారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్నను కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. కంటెన్మెంట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓడిపోయిన తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.