Secunderabad fire accident ramgopal pet deccan night ware store
mictv telugu

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. ఆ ఇద్దరూ చనిపోయిట్లేనా?

January 19, 2023

Secunderabad fire accident ramgopal pet deccan night ware store

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేటలో ఉన్న డెక్కన్ నైట్ వేర్ స్టోర్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. నలుగురిని రక్షించామని పోలీసులు చెబుతున్నారు. అయితే మరికొందరు లోపల చిక్కకుని ఉండొచ్చని, ఇద్దరి ఆచూకీ తెలియడం లేదని భావిస్తున్నారు. ప్లాస్టిక్, ఇతర కాలే వస్తువులను ఎక్కువగా స్టోర్ చేసి ఉండడంతో మంటల తీవ్రంగా ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు. లోపలికి వెళ్లి చూడ్డం సాధ్యం కావడం లేదు. జనావాసాల మధ్య ఇలాంటి సంఘటన జరగడంతో స్థానిక ప్రజలు భయపడుతున్నారు. అసలు దీనికి అనుమతులు ఉన్నాయా అని దర్యాప్తు మొదలైంది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
చుట్టుపక్కల దట్టమైన పొగ ఆవరించడంతో కొన్ని ఇళ్లను ఖాళీ చేయించారు. ఏడెనిమిది గంటలుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. భవనంలోని రెండు స్లాబులు కుప్పకూలాయి. మొత్తం భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితి నెలకొంది. హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికులు భరోసా ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొంతమంది అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.