సికింద్రాబాద్ కొత్తపెళ్లికుడును చంపేసిన వాట్సాప్ - MicTv.in - Telugu News
mictv telugu

సికింద్రాబాద్ కొత్తపెళ్లికుడును చంపేసిన వాట్సాప్

September 29, 2018

సోషల్ మీడియా మోతాదు మించితే అనర్థాలు జరుగుతాయి. మానవ సంబంధాలు కనుమరుగైపోతాయి. చివరకు మనుషులు కూడా మిగలకపోవచ్చు. వాట్సాప్ చాటింగ్‌ వ్యవసం పచ్చని కాపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పొద్దస్తమానం వాట్సాప్ చాటింగ్ ఏంటి అని భార్య మందలించడంతో మనస్తాపం చెందిన నవవరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఈ సంఘటన జరిగింది.

rr

మృతుడు శివకుమార్‌కు గత నెల 12న పెళ్లయింది. అతడు ఏ కాస్త సమయం దొరికినా చాలు వాట్సాప్ చాటింగ్ చేస్తుండడంతో భార్య మందలించింది. తనను పట్టించుకోకుండా ఎప్పుడూ మెసేజీల గొడవేంటని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం కుటుంబసభ్యులకు చెబుతానని బెదిరించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శివకుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు.