Secunderabad - Vizag Vande Bharat Train Fare Announcement
mictv telugu

సికింద్రాబాద్ – వైజాగ్ వందేభారత్ రైలు ఛార్జీల ప్రకటన

January 14, 2023

రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన సికింద్రాబాద్ – విశాఖపట్టణం మధ్య ఆదివారం వందే భారత్ రైలు పరుగులు తీయనుంది. ఉదయం పది గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాదులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డిలు జెండా ఊపనున్నారు. కేవలం ఎనిమిది గంటల్లో విశాఖకు వందేభారత్ చేరుకోనుంది. మిగతా రైళ్లకు 12 గంటలు పడుతోంది. ఇక కొత్తగా వస్తున్న ఈ రైలుకు శనివారం నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా, ఈ రైలులో వసూలు చేసే ఛార్జీలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
1. సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ. 520
2. సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ. 750
3. సికింద్రాబాద్ నుంచి విజయవాడ రూ. 905
4. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి రూ. 1365
5. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం రూ. 1665
6. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం రూ. 3120 (ఎగ్జిక్యూటివ్ చైర్)
ఇక ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా, ఇప్పటి రైల్వే ట్రాకులు ఆ వేగానికి తగ్గ సామర్ధ్యం లేకపోవడంతో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించనుంది. ప్రస్తుత సూపర్ ఫాస్ట్ రైళ్ల వేగం గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అటు వందేభారత్ రైలు వారంలో ఆదివారం మినహా అన్ని రోజుల్లోనూ అందుబాటులో ఉంటుంది.