Home > Featured > మునుగోడులో డేగ కళ్లు

మునుగోడులో డేగ కళ్లు

మునుగోడు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 298 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.మొత్తం 2 లక్షల 41 వేల మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం భారీగా పోలీసుల్ని మోహరించారు. 3 వేల 5 వందల మంది తెలంగాణ పోలీసులు, 20 కంపెనీల కేంద్రబలగాలు పహారా కాస్తున్నాయి. ప్రతి ఊరుపై ప్రత్యేక నిఘా పెట్టారు. వందకుపైగా చెక్ పోస్టుల్ని పెట్టారు. ఇప్పటిదాకా మునుగోడులో 8 కోట్ల రూపాయల్ని సీజ్ చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు.

మూడు ఈవీఎంలు
మునుగోడులో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలదాకా పోలింగ్ జరుగుతుంది. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్ బూత్‌లో మూడు ఈవీఎంలు వాడుతున్నారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను రెడీ చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు.

నిఘా నీడలో
ప్రతి పోలింగ్ కేంద్రంపై ప్రత్యేక నిఘా పెట్టారు. అన్ని బూత్‌ల నుంచి వెబ్ కాస్టింగ్ ని ఈసీ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. 3 వేల 5 వందల మంది తెలంగాణ పోలీసులతో పాటు 20 కంపెనీల కేంద్రబలగాల్ని రప్పించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. చౌటుప్పల్ , సంస్థాన్ నారాయణపూర్ మండలాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. 82 పోలింగ్ కేంద్రాల్లో భారీగా భద్రత ఏర్పాటు చేశామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు.

ఈసీ నజర్
298 పోలింగ్ కేంద్రాల్లో 1,192 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 50 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్ లు పోలింగ్ సరళిని పర్యావేక్షిస్తారు. పార్టీలు డబ్బులు,మద్యం పంచకుండా ప్రతి ఊర్లో డేగకళ్లతో వీక్షిస్తున్నారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ చెప్పారు. చెక్ పోస్ట్‌ల దగ్గర ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటిదాకా 8 కోట్ల డబ్బు సీజ్ చేశామన్నారు.

ఫిర్యాదుల వెల్లువ
మునుగోడు బై పోల్ పై ఈసీకి పెద్దయెత్తున ఫిర్యాదులు అందాయి. పార్టీలు పోటాపోటీగా కంప్లయింట్ చేసుకున్నాయి. మునుగోడు బై పోల్ ని వాయిదా వేయాలని స్వతంత్ర అభ్యర్థులు కోరారు. నెలరోజులుగా మద్యం, డబ్బుల ప్రవాహం కొనసాగిందని దీన్ని కారణంగా చూపించారు.

Updated : 2 Nov 2022 6:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top