Home > Featured > ఫుట్ బాల్ జట్టుకి ఎఫ్ - 16 ఫైటర్ జెట్లతో సెక్యూరిటీ.. వీడియో వైరల్

ఫుట్ బాల్ జట్టుకి ఎఫ్ - 16 ఫైటర్ జెట్లతో సెక్యూరిటీ.. వీడియో వైరల్

ఖతార్ వేదికగా జరుగనున్న ఫిపా వరల్డ్ కప్ టోర్నమెంటులో పాల్గొనేందుకు సభ్యదేశాలు ఇప్పటికే సిద్ధం అయ్యాయి. తమ ఫుట్ బాల్ జట్లను ఇప్పటికే ఖతార్ దేశానికి తరలించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో పోలండ్ జట్టు ప్రత్యేక విమానంలో ఖతార్ కి బయల్దేరింది. అయితే జట్టు ప్రయాణిస్తున్న విమానానికి భద్రత కల్పించేందుకు అత్యాధునిక ఎఫ్ 16 యుద్ధ విమానాలు ఎస్కార్టుగా వచ్చాయి. ఉక్రెయిన - రష్యా యుద్ధం నేపథ్యంలో ఇటీవల ఓ ఉక్రెయిన్ మిస్సైల్ పోలండ్ భూభాగంలో పడి ఇద్దరు మరణించారు. దీంతో అప్రమత్తమైన ఆ దేశం.. జట్టును తీవ్ర భద్రత మధ్య తరలించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోలండ్ జాతీయ జట్టు ట్విట్టర్ ద్వారా పంచుకుంది. కాగా, ఈ వరల్డ్ కప్ కి పాకిస్తాన్ సైన్యం భద్రతా వ్యవహారాలు చూసుకుంటోంది.

Updated : 18 Nov 2022 6:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top