Security forces killed a terrorist in Jammu and Kashmir's Kupwara district
mictv telugu

Jammu and Kashmir: కుప్వారా జిల్లాలో టెర్రిస్టులను హతమార్చిన జవాన్లు..!!

February 16, 2023

జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారాలో చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు. నియంత్రణ రేఖ వెంబడి సైద్ పోరా ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సిబ్బంది భగ్నం చేసినట్లు సమాచారం. చొరబాటకు యత్నించిన ఓ ఉగ్రవాదిని జవాన్లు హతమార్చారు. ఈ కాల్పుల్లో జవాన్లకు గాయాలైనట్లు సమాచారం. కుప్వారా పోలీసులు అందించిన ఇంటెల్ ఆధారంగా భద్రతా సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మరికొంతమంది ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.