Security hiked in Karnataka's Srirangapatna over call for puja at mosque
mictv telugu

శ్రీరంగపట్నంలో టెన్షన్.. మసీదులో ప్రార్థనకు వీహెచ్‌పీ పట్టు

June 4, 2022

వివాదాస్పద జామియా మసీదులో శ‌నివారం హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తామ‌ని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) హెచ్చరిక‌ల నేప‌ధ్యంలో క‌ర్నాట‌క రాష్ట్రం మాండ్య జిల్లాలోని మ‌సీదు ప‌రిస‌రాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. వివాదాస్ప‌ద మ‌సీదుకు ఒక కిలోమీట‌ర్ ప‌రిధిలో నిర‌స‌న‌ల‌కు దిగుతామ‌ని వీహెచ్‌పీ, బ‌జ‌రంగ్ ద‌ళ్‌లు ప్ర‌క‌టించాయి. దీంతో నగరంలో శనివారం సాయంత్రం 6 గంటల వరకూ 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు.

మాండ్యా జిల్లాలోని శ్రీరంగ‌ప‌ట్నం తాలూకాలోని ఈమసీదులో శనివారం ప్రార్థనలు నిర్వహించటానికి విశ్వహిందూ పరిషత్ జూన్ 4వ తేదీన ‘చలో శ్రీరంగపట్నం’ పిలుపునిచ్చింది. వీహెచ్‌పీ హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మ‌సీదు ప్రాంతంలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేయాల‌ని హోంమంత్రి అర‌గ జ్ఞానేంద్ర జిల్లా యంత్రాంగాన్ని అల‌ర్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛిత ఘటనలూ జరగకుండా నివారించటానికి తగినంత భద్రతా ఏర్పాట్లు చేశామని, పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించామని మాండ్యా పోలీస్ సూపరింటెండెంట్ యతీశ్ ఎన్ విలేకరులకు తెలిపారు. ‘మసీదు చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెట్టటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు. ఈ ఉత్త‌ర్వులు ఈనెల 3 నుంచి 5 వ‌తేదీ మ‌ద్యాహ్నం వ‌ర‌కూ అమ‌ల్లో ఉంటాయ‌ని అధికారులు పేర్కొన్నారు.