అల్లూరి విగ్రహావిష్కరణకు సోమవారం ఏపీకి వచ్చిన ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలు వెలుగు చూశాయి. హైదరాబాదు నుంచి విజయవాడకు విమానంలో చేరుకున్న ప్రధాని.. అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భీమవరం బయల్దేరారు. ఈ క్రమంలో గన్నవరం నుంచి హెలికాప్టర్లో వెళ్తుండగా, హెలికాప్టర్‌కు అతి సమీపంలో నల్ల బెలూన్లు ఎగిరాయి. ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండే కేసరిపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు నల్ల బెలూన్తను వదిలారు. ఈ మేరకు పోలీసులు సీరియస్‌గా విచారణ చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ రోజు ఏపీలో నిరసనకు దిగింది. రాజమండ్రి, జంగారెడ్డి గూడెం, గన్నవరం ఎయిర్ పోర్టుల వద్ద ఆ పార్టీ నిరసనలు వ్యక్తం చేసింది. ఇప్పటికే ఏలూరు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ప్రధాని భద్రతలో లోపాలు వెలుగు చూడడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.