నాయకులకు పార్టీల సొమ్ముతోనే భద్రత కల్పించుకోండి... - MicTv.in - Telugu News
mictv telugu

నాయకులకు పార్టీల సొమ్ముతోనే భద్రత కల్పించుకోండి…

November 29, 2017

ప్రజల నుంచి గోళ్లూడగొట్టి వసూలు చేసే పన్నులతో రాజకీయ నేతలకు భద్రత కల్పిస్తుండడంపై బాంబే హైకోర్టు నిప్పులు చెరిగింది. ‘ప్రజాధనంలో వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందా? రాజకీయ నాయకులకు అంతగా పోలీసు భద్రత అవసరమనుకుంటే వారి పార్టీలు వసూలు చేసే నిధుల నుంచే ఆ ఖర్చు భరించాలి’ అని మహారాష్ట్ర సర్కారుకు తేల్చి చెప్పింది.

అలాగే ప్రైవేట్‌ వ్యక్తులకు పోలీసు భద్రత కల్పించే విధానాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆదేశించింది. వీఐపీలతోపాటు, రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ప్రభుత్వం ప్రజాధనంతో భద్రత కల్పించినందుకు అయ్యే ఖర్చును వారే భరించాలంటూ ఓ న్యాయవాది వేసిన దావాపై హైకోర్టు ఈమేరకు స్పందించింది. మహారాష్ట్రలో వెయ్యిమందికిపైగా ప్రైవేట్‌ వ్యక్తులకు సర్కారు కోట్లు ఖర్చు చేసి భద్రత కల్పిస్తోంది.