ఫోటోలు చూతము రారండి ! - MicTv.in - Telugu News
mictv telugu

ఫోటోలు చూతము రారండి !

August 19, 2017

వరల్డ్ ఫోటోగ్రఫీ డే అని మనమివాళ చాయాచిత్రానికి పండగ జరుపుకుంటున్నాం. ఫోటో మనకు తెలియని ఎన్నో విషయాలను, వెతలను కళ్ళకు కడుతుంది. సమస్యలకు చిత్తరువు అవుతుంది. ఫోటో వర్తమానంలో తను ప్రశ్నిస్తూనే గతానికొక జ్ఞాపకంగా నిలిచిపోతుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుండి చాలా మంది ఫోటోగ్రాఫర్లు అయిపోతున్నారు. వారి వారి పాయింటాఫ్ వ్యూలోంచి అందమైన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో ప్రదర్శించుకుంటున్నారు. ప్రతిరోజూ ఎఫ్ బీ, వాట్సాప్ లలో వేలు, లక్షల్లో ఫోటోలు అప్ లోడ్ అవుతుంటాయి. అనుబంధాలకు, ఆత్మీయతలకు ప్రతీకగా ఒక్క ఫోటోనే నిలబడుతుందనేది ఎవరూ కాదనని సత్యం. ఫోటోల వల్ల మనకు తెలియని, చదవని ఎన్నో జీవితాలు కొత్తగా దర్శనమిస్తుంటాయి. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను చూద్దామా ‘ ది అట్లాస్ ఆఫ్ బ్యూటీ ’ నుండి. రుమేనియన్ ఫోటోగ్రాఫర్ మిహీలా నోరోక్ తీసిన ఈ క్రింది ఫోటోలు మనసు మీద ప్రగాఢంగా ముద్ర వేస్కుంటాయని చెప్పొచ్చు.

1. అత్యంత సహజ సిద్ధమైన ఫోటోగా ప్రఖ్యాతి గాంచినది. రుమేనియన్ బ్యూటీ యొక్క ఇన్నోసెన్సును చక్కగా ప్రతిబింబించింది ఈ ఫోటో.

2. వీధులు క్లీన్ చేసే వారి కన్నా సౌందర్యం వేరే ఏముంటుందని తెలుపుతోంది ఈ ఫోటో. తజకిస్తాన్ దేశపు మురికిని క్లీన్ చేసే సౌందర్య చిత్రమిది.

3. ఇరానియన్ సాంప్రదాయ వస్త్రాధరణలో వున్న ఈ అమ్మాయి అందం మిహీలా ఫోటోతో మరింత ద్విగిణీకృతమైందనే చెప్పుకోవాలి.

4. ఎలాంటి మేకప్ లేకుండా అత్యంత సహజ సిద్ధంగా వున్న దుషాంబే తజిక్ మహిళ సౌందర్యం ఈ ఫోటోతో మరింత మెరిసిపోతోంది కదూ.

5. సెంట్రల్ ఏషియన్ పెరూ అందం ఇది. ఈ ఒక్క ఫోటోతో ఆ దేశ స్థితిగతులు మనకు కాస్తలో కాస్తైనా మనలో మెసులుకుంటాయి.

6. దివికీ – భువికీ నేనొక అగ్రతారనన్నట్టుగా నిలబడిన ఈ ఫిన్నిష్ మహిళ లావణ్యం చూసిన కంటిని తిప్పుకోనివ్వదు.

7. చైనా అందాన్ని ఆహా అని పొగడాలనిపించేంత అత్యద్భుతమైన ఫోటో ఇది.

8. రుమేనియాలోని క్లూజ్ లో సిరామిక్ ఆర్ట్ స్టూడెంట్ ఇలా మిహీలా కెమెరాకు చిక్కింది.

9. అఫ్ఘనిస్తాన్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రమిది. ఆఫ్గాన్ దేశ గొప్పతనాన్ని తెలిపే మెస్మరైజింగ్ క్లిక్ ఇదని చెప్పొచ్చు.

10. చీలీ దేశం అందాన్ని ఇంత చక్కగా ఫోటోలో బంధించిన మిహీలా నిజంగా అభినందనీయురాలే.

11. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అందాలు ఏవంటే మిహీలా పోటోలే అందుకు నిదర్శనంగా నిలబడతాయనడానికి ఈ చైనా అందాన్ని ఒక్కసారి చూడండి.

12. టర్కీలోని ఇస్తాంబుల్ అతివ అందాలు ఎంత చూసినా తనివి తీరదు.

13. కొలంబియా మహిళ చిత్రమిది. వివిధ దేశాల మహిళలను తన కెమెరాతో క్లిక్కుమన్పించడంలో మిహీలా 100 పర్సెంట్ సక్సెస్ అయ్యారు.

 

 

ఇలాంటివెన్నో అందమైన, అద్వితీయమైన మిహీలా నోరోక్ ఫోటోలు చూడాలంటే ‘ The Atlas of Beauty ’ ని సందర్శించాల్సిందే.

 

http://photogallery.indiatimes.com/celebs/celeb-themes/the-atlas-of-beauty/Check-out-this-Pamiri-woman-in-Gorno-Badakhshan-autonomous-province/articleshow/48775732.