Home > Featured > వామ్మో..కరెంట్ బిల్లు ఇన్ని కోట్లా..అనారోగ్యంతో దవాఖానలో చేరిన వ్యక్తి

వామ్మో..కరెంట్ బిల్లు ఇన్ని కోట్లా..అనారోగ్యంతో దవాఖానలో చేరిన వ్యక్తి

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులు మొదలుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తోపాటు మార్కెట్లో అన్నీ వస్తువులకు రేట్లు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై, ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి కరెంట్ బిల్లులతోపాటు పలు వస్తువులపై ఛార్జీలను పెంచాయి. దాంతో మధ్య తరగతి కుటుంబానికి ప్రతి నెల రూ. 200 నుంచి రూ. వెయ్యిలోపు కరెంట్ బిల్లు వస్తుంది. ఒక్కొక్కసారి వెయ్యి నుంచి పదిహేను వందలలోపు అటూఇటుగా వస్తుంది. కానీ, ఓ మధ్య తరగతి కుటుంబానికి జులై నెలలో రూ. రూ.3,419 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఆ కరెంట్ బిల్లును చూసి దెబ్బకు ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చేరాడు.

వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగర శివ్ విహార్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక గుప్తా కుటుంబానికి ఆరు రోజుల కిందట జులై నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు వచ్చింది. అది చూసి కుటుంబం అంత ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏకంగా రూ. 3,419 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. మొదటగా ఆ కరెంట్ బిల్లును ఆ ఇంటి పెద్ద అయిన (ప్రియాంక మామ) చూసి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పక్కనున్న ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు.

అనంతరం ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకణె మాట్లాడుతూ.. "జులై 20న వచ్చిన ఈ బిల్లును విద్యుత్తు శాఖ పోర్టల్ ద్వారా పరిశీలించాను. అయినా అంతే మొత్తం ఉంది. ఈ విషయాన్ని స్టేట్ పవర్ కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా, జరిగిన పొరపాటును గుర్తించి రూ.1,300గా సవరించారు. అయితే, ఈ పొరపాటుకు ప్రధాన కారణం ఏమిటని అధికారులను నిలదీశాను. దానికి వారు విద్యుత్తు బిల్లు పంపిణీకి వచ్చిన ఉద్యోగి సాఫ్ట్‌వేర్‌లో 'యూనిట్లు' అని ఉన్నచోట పొరపాటున వినియోగదారు సంఖ్యను రాశారు. దీంతో బిల్లు రూ. కోట్లలోకి వెళ్లింది అని చెప్పారు. ఆ తర్వాత నేను ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తెలియజేశాను. దానికి ఆయన సంబంధిత విద్యుత్తు ఉద్యోగిపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు" అని ఆయన అన్నారు.

Updated : 27 July 2022 2:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top