Seeing the Dead body of Krishna Raju, his wife Syamaladevi burst into tears.
mictv telugu

కృష్ణంరాజు భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరైన భార్య శ్యామలాదేవి

September 11, 2022

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు కృష్ణంరాజు (83) కన్నుమూశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉంచారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలాదేవి కన్నీరుమున్నీరయ్యారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీ నటులు మోహన్‌బాబు, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు నివాళులర్పించారు. కృష్ణంరాజు మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్‌. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన మృతి టాలీవుడ్‌ కు తీరలోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. కృష్ణం రాజు మృతికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం. ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటు.. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని రేవంత్ రెడ్డి తెలిపారు.