ఎర్రబెల్లివి నీచరాజకీయాలు: సీతక్క - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రబెల్లివి నీచరాజకీయాలు: సీతక్క

November 1, 2017

టీడీపీని వదలి కాంగ్రెస్ చేరిన మాజీ ఎమ్మెల్యే సీతక్క తనను విమర్శించిన టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్రఆరోపణలు చేశారు. ఆయన నీచ రాజకీయాలకు పాల్పడతున్నాడని  ఆరోపించారు. తాను పదవుల కోసమో, డబ్బు కోసమో పార్టీ మారలేదని స్పష్టం చేశారు. ‘పదవుల కోసమే అయితే నేను టీఆర్ఎస్ లోనే చేరేదాన్ని. ఎర్రబెల్లి విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను..’ అని పేర్కొన్నారు. మూడేళ్లుగా రేవంత్ రెడ్డితో కలసి ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని, రేవంత్ కుటుంబం తనను ఆడబిడ్డలా చూసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ వాళ్లందరూ ఇదివరకు టీఆర్ఎస్‌తో సంప్రదింపు జరిపారని, వాళ్లు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకులని ఎర్రబెల్లి ఆరోపించారు.