“నమస్తే తెలంగాణ” ఎడిటర్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల..! - MicTv.in - Telugu News
mictv telugu

“నమస్తే తెలంగాణ” ఎడిటర్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల..!

July 28, 2017

సినిమా ద‌ర్శ‌కుడు ఎడిట‌ర్ ఏంట‌నుకుంటున్నారా?.. అవును నిజ‌మే.. ఫిదా సినిమా ద‌ర్శ‌కుడు కాసేపు స‌ర‌దాగా న‌మ‌స్తే తెలంగాణ గెస్ట్‌ ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఫిదా సినిమాలో మ‌న తెలంగాణ భాష‌, సంస్కృతికి పెద్ద పీఠ.. కాదు కాదు.. ఏకంగా సింహాస‌న‌మే వేసినందుకు మా ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి ఫిదా అయి వారికి ఈ అరుదైన గౌర‌వాన్ని క‌ల్పించి ఆయ‌న ముచ్చ‌ట తీర్చుకున్నారు. ఒక న్యూస్ పేప‌ర్ ఎలా త‌యారు వుతుందో శేఖ‌ర్ క‌మ్ముల‌కు న‌మ‌స్తే ఎడిట‌ర్ వివ‌రించారు. శేఖ‌ర్ క‌మ్ముల‌తో పాటు ప్రొడ్యూస్ దిల్ రాజు కూడా న‌మ‌స్తే కార్యాల‌యానికి వచ్చారు.

ఒక న్యూస్ పేప‌ర్ ఆఫీసుకు త‌మ‌ను ఇంత ఆత్మీయంగా ఆహ్వానించ‌డం త‌మ జీవితంలో ఇదే మొద‌టి సారి అని దిల్‌రాజు, శేఖ‌ర్ క‌మ్ముల ఎంతో ఫిదా అయ్యారు. మా ఫిదా సినిమా స‌క్సెస్ క‌న్నా మీ ఆహ్వాన‌మే మ‌మ్మ‌ల్ని ఎక్కువ ఫిదా చేసింది అన్నారు. న‌మ‌స్తే ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డి, ఆప‌రేష‌న్స్ జీఎం సీహెచ్ శ్రీ‌నివాస్‌, తెలంగాణ టుడే ఎడిట‌ర్ శ్రీనివాస్‌రెడ్డిలు దిల్‌రాజు, శేఖ‌ర్ క‌మ్ముల‌ను శాలువా క‌ప్పి స‌న్మానించారు. న‌మ‌స్తే టీంతో వారు కాసేపు ఫిదా సినిమా స‌క్సెస్ గురించి మాచ్చ‌టించారు. న‌మ‌స్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజ‌య్ అప్ప‌టిక‌ప్పుడే శేఖ‌ర్ క‌మ్ముల కార్టూన్ గీసిచ్చారు. దీంతో ఆయ‌న ఫుల్ ఫిదా…

courtesy by : namasthe telangana