సెల్ఫ్ డ్రైవ్ ఓలా కార్లు వచ్చేస్తున్నాయ్..  - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫ్ డ్రైవ్ ఓలా కార్లు వచ్చేస్తున్నాయ్.. 

September 12, 2019

Self drive cars launching ola.

ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా కూడా సెల్ఫ్ డ్రైవ్ బాట పట్టింది. డ్రైవర్ అక్కర్లేకుండా కస్టమర్లే నడుపుకోడానికి కార్లను తీసుకొస్తోంది. వీటిని బెంగళూరు నగరంలో పరీక్షిస్తోంది. పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ కార్లు అప్పగించింది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ సెల్ఫ్ డ్రైవర్ కార్లను తీసుకొస్తారు. ఈ సర్వీసుకు ‘ఓలా డ్రైవ్’ అని పేరు పెట్టారు. ‘భారత కస్టమర్ల గురించి బాగా తెలిసిన మేం మా సేవలను విస్తరించడంలో భాగంగా సెల్ఫ్ డ్రైవ్ సర్వీసును ప్రేశపెట్టాం’ అని తెలిపిందే. దేశంలో 10 వేల కార్లను సర్వీసు కింద ఇస్తారు. దీని కోసం బీఎండబ్ల్యూ, ఆడి వంటి ఖరీదైన కార్ల కంపెనీలతో టచ్ లో ఉంది ఓలారు. పికప్ ప్లాయింట్ల వద్ద కస్టమర్లు ఓలా కార్లను అద్దెకు తీసుకుని గమ్యం చేరుకున్న తర్వాత అక్కడి పాయింట్లలో అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతంలో దేశంలో జూమ్ కార్, మైల్స్ వంటి కంపెనీలు సెల్ఫ్ డ్రైవ్ కార్ సర్వీసులు అందిస్తున్నారు.