లాక్‌డౌన్‌లో వ్యాపారి నిజాయితీ మంత్రం.. ‌బ్రెడ్‌లు సూపర్ సేల్ - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌లో వ్యాపారి నిజాయితీ మంత్రం.. ‌బ్రెడ్‌లు సూపర్ సేల్

April 5, 2020

Self service: Bakery in Tamil Nadu ensures social distancing to the fullest

ఉత్తప్పుడే తమ వ్యాపారాలను ఎలా నడిపించుకోవాలో అని రకరకాల ఐడియాలతో ముందుకు పోతుంటారు వ్యాపారులు. మరి సంక్షోభంలో ఊరుకుంటారా? ఎడారిలో ఇసుకను అమ్ముకోవడమే వ్యాపారి లక్షణం అన్నట్టు వారి మెదళ్లు ఇప్పుడు భలే పనిచేస్తుంటాయి. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాడు ఈ వ్యాపారి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఓ మిఠాయి షాప్ యజమాని తాను తయారేచేసే బ్రెడ్‌లను అమ్ముకునేందుకు వినూత్న పద్దతిని ఎంచుకున్నాడు. నిజాయితీని ఎరగా వేసి, మనుషుల్లోని నిజాయితీకి పరీక్ష, తన వ్యాపారానికి సుపరీక్ష పెట్టుకున్నాడు. 

నగరంలోని రత్నపురం బ్రిడ్జ్ వద్ద మూసివేసివున్న తన స్వీట్ షాప్ ముందు టేబుల్ వేశాడు. దానిపై కొన్ని బ్రెడ్లు ఉంచి, దాని పక్కనే ఓ బోర్డు పెట్టించారు. దానిమీద.. ‘ఇది సెల్ఫ్ సర్వీస్.. బ్రెడ్ ధర రూ. 30, కావాల్సిన వారు తీసుకుని, తగిన మొత్తాన్ని పక్కనే ఉన్న డబ్బాలో వేయాలి’ అని రశాడు. దీనిని గమనించిన వారు అక్కడికి వచ్చి తమకు అవసరమైన బ్రెడ్ తీసుకుని, సరిపడ్డా డబ్బును డబ్బాలో వేసి వెళ్తూ తమ నిజాయితీని నిరూపంచకుంటున్నారు. దీంతో వ్యాపారి ఐడియా ఫలించి ఇల్లు కదలకుండా వ్యాపారం చేసుకుంటున్నాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.