సెల్ఫీ థ్రిల్స్ బట్ కిల్స్..! - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ థ్రిల్స్ బట్ కిల్స్..!

July 6, 2017

సెల్ఫీ పిచ్చి పీక్స్ కెళ్తే ఇలాగే ఉంటది మరి…లైక్ లు,కామెంట్ల కోసం రిస్క్ చేస్తే లైఫ్ టర్న్ పరలోకానికే..ఈ విషయం తెలిసినా వెర్రెక్కిన కుర్రకారు థ్రిల్ మూమెంట్ క్యాప్చర్ కోసం కిర్రాక్ పనులు చేస్తున్నారు. ఇలా పట్టు తప్పి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుర్రకింకాలే కాదు వయస్సు పైబడుతున్న వాళ్లు అప్పడప్పుడు సెల్ఫీ రిస్కులు చేస్తున్నారు. అందరూ ఇలాగే ఉంటే ఎందుకుండదు..ఇండియా టాప్ లో. కానీ సెల్ఫీ లు తీసుకోవడంలో కాదు..సెల్ఫీ డెత్ ల్లో..

షాకింగ్ న్యూసైనా నమ్మి మారాల్సిన నిజం. కార్నెగీ మిల‌న్ యూనివ‌ర్సిటీ, ఢిల్లీలోని ఇంద్ర‌ప్ర‌స్త ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సంయుక్తంగా మి, మై సెల్ఫ్ అండ్ మై కిల్ఫీ పేరుతో సెల్ఫీల‌పై రీసెర్చ్ చేసింది. వాళ్ల నివేదిక చెబుతోంది ఇండియానే టాప్ అని. మార్చి 2014, సెప్టెంబ‌ర్ 2016 మ‌ధ్య ప్ర‌పంచంలో మొత్తం 127 సెల్ఫీ మ‌ర‌ణాలు సంభ‌విస్తే.. అందులో 76 ఇండియాలోనే.

సో.. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటంటే..లైక్ ల కోసం పిచ్చిపనులు చేయకండి..రిస్కీ సెల్ఫీ పనులొద్దు. లైక్ వస్తేంటి..రాకపోతేంటి…ప్రాణాలు ఉంటే చాలు..