దూసుకొస్తున్న రైలు ముందు సెల్ఫీ.. పక్కకు తప్పుకోలేక - MicTv.in - Telugu News
mictv telugu

దూసుకొస్తున్న రైలు ముందు సెల్ఫీ.. పక్కకు తప్పుకోలేక

November 13, 2019

సెల్పీ సరదా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రైలింజన్ ముందు నిలబడి సెల్పీ తీసుకుంటుండగా ఓ యువకుడిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలతో మరణించాడు. కోయం బత్తూరులో ఇది జరిగింది. స్నేహితుడి కళ్ల ఎదుటే అతడు మరణించడం కలకలం సృష్టించింది. 

బిహార్‌కు చెందిన రాజ్ మోహన్ కుమార్(25) అనే వ్యక్తి  కోయంబత్తూరులో ఉంటూ ఓ బనియన్ కంపెనీలో పని చేస్తున్నాడు. రోజూలాగే అతని స్నేహితుడు రాజేష్‌తో కలిసి రైలు పట్టాలు దాటుకుంటూ డ్యూటీకి బయలుదేరాడు. పోతనూర్‌ నుంచి తిరుప్పూర్‌ ఓ రైలింజన్‌ రావడం చూసిన రాజ్‌మోహన్‌ ఇంజన్‌ ముందు నిలబడి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అది దగ్గరకు వచ్చేలోపు తప్పుకోవాలనుకున్నాడు. కానీ  అప్పటికే ట్రైన్ వేగంగా దూసుకువచ్చి అతని బలంగా తగిలింది. తీవ్రగాయాలతో అతడు మరణించాడు. వెంటనే రైల్వే అధికారులు అక్కడికి వచ్చి అతని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.