సెల్ఫీ పిచ్చి..60 అడుగుల లోయలో పడి.. - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ పిచ్చి..60 అడుగుల లోయలో పడి..

April 9, 2018

సెల్ఫీ.. సెల్ఫీ.. హీరోతో, హీరోయిన్‌తో, కుక్కతో ఆవుతో.. రైలుతో, విమానంతో.. ఎక్కడ చూసినా ఇదే ఉన్మాదం. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీ దిగి, దాన్ని సోషల్ మీడియాలో అంటించుకుని, లైకులు దండుకుని మురిసిపోవడం వేలం వెర్రిగా మారుతోంది. ఉత్తరాఖండ్‌లో ఓ సెల్ఫీప్రియుడు ప్రమాదకర ఫీట్ చేశాడు. కొండచివర సెల్ఫీ దిగబోతూ 60 అడుగుల లోతున్న లోయలో పడిపోయాడు.

 హరిద్వార్ లో ఈ ఘటన జరిగింది. అతనితోపాటు ఉన్న వ్యక్తులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందివ్వడంతో వారు లోయలో వెతికి అతణ్ని కాపాడారు. తీవ్రగాయాలతో అతడు ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్నాడు. మానసాదేవి ఆలయానికి వెళ్తూ అతడు సెల్ఫీ ట్రై చేశాడు.