వరదల్లోనూ వదలని సెల్ఫీ మోజు..ఏమైందో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

వరదల్లోనూ వదలని సెల్ఫీ మోజు..ఏమైందో చూడండి

November 17, 2019

సెల్ఫీ ఫోటోల వలన ఎన్నో ప్రాణాలు పోతున్న సంగతి తెల్సిందే. అయినా సెల్ఫీలపై ప్రజలకు మోజు పోవడం లేదు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుంటూ చావు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా వెనిస్ నగరంలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. వెనిస్ నగరాన్ని ప్రస్తుతం వరదలు ముంచ్చేత్తుతున్నాయి. 

ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ పర్యాటకుడు శాంతా క్లాజ్ వేషధారణలో చేతిలో సెల్ఫీ స్టిక్ పట్టుకొని తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ అతడికి నచ్చిన చోట ఆగి సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంతలో కొంచెం దూరంలో ఓ ప్రదేశం కనపడింది. అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. కానీ అతడున్న ప్రదేశానికి.. వెళ్లాల్సిన ప్రదేశానికి మధ్యలో ఓ కెనాల్ ఉంది. వరదల కారణంగా కెనాల్‌ కనపడలేదు. దీంతో అలాగే ముందుకు వెళ్ళాడు. కెనాల్ రావడంతో ఒక్కసారిగా అందులో పడిపోయాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.