మందును పద్ధతిగా అమ్ముతున్నం.. శ్రీనివాస్ గౌడ్ - MicTv.in - Telugu News
mictv telugu

మందును పద్ధతిగా అమ్ముతున్నం.. శ్రీనివాస్ గౌడ్

September 3, 2019

జనాలను మద్యం తాగండి అని ప్రోత్సహించేదీ, జరిమానాలతో  వీరబాదుడు బాదేదీ ఎక్సైజ్ శాఖే కదా అని ఆయనను మైక్ టీవీ ప్రశ్నించింది. ‘ఎవరికి తోచినట్టు వాళ్లు మాట్లాడతారు. అలాంటివాళ్ల మాటలు పట్టించుకోవద్దు’ అని ఆయన జవాబు చెప్పారు. ఆయన ఎవరంటే.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్! మద్యాన్ని పరిమితంగా తీసుకోవాలనే తాము చెబుతున్నామని.. మితికి మీరి తాగొద్దనే ఫైన్లు వేస్తున్నాం అని అన్నారు. గతంలో మద్యపాన నిషేదం వచ్చినప్పుడు కల్తీ మద్యం వచ్చి ఎంతమంది ప్రాణాలు బలిగొందో తెలియదా అని పేర్కొన్నారు. 

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారంతా ప్రధానంగా ఎక్సైజ్ శాఖనే నిందిస్తారు కదా అంటే.. ఎవరు ఎలా అనుకున్నా.. మేమైతే వారు ఎక్కువగా తాగకుండా ఆ పరీక్షలు చేస్తున్నాం అని సమాధానం ఇచ్చారు. బార్‌కు వెళ్లకుండా ఇంటికే తెచ్చుకుని తాగాలి.. లేదంటే డ్రైవర్‌ను పంపించాలి అని అన్నారు. మాకు డబ్బులే ప్రధానం అని కొందరు అనుకుంటున్నారు.. కానీ, తాము ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకున్నామని వెల్లడించారు.