సినిమా చూడడానికి టిక్కెట్ల కోసం ఓ మేయర్ థియేటర్లకు లేఖ రాయడంతో థియేటర్ ఓనర్లు విస్తుపోతున్నారు. వివరాలు..విజయవాడలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ ఓనర్లకు ఓ లేఖ వచ్చింది. అందులో సినిమా విడుదలైన మొదటి రోజు అన్ని ఆటలకు వంద టిక్కెట్లను తమకు కేటాయించమని ఉంది. వాటి ఖరీదు కూడా చెల్లిస్తామని, టిక్కెట్లను ఛాంబర్‌కు పంపాలని రాసి ఉంది.ఈ విషయంపై మేయర్ ను సంప్రదించగా, నిజమేనని వ్యాఖ్యానించింది. పార్టీ కార్పొరేట్లు, నాయకుల, ఇతర సిబ్బంది
టిక్కెట్లు కావాలని తరచూ అడుగుతున్నారని చెప్పారు.