చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. తాజాగా మరో ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి తుదిశ్వాస విడిచారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. రాయచూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గురువారం(మే 19) కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలు దక్షిణాది సినిమాల్లో చలపతి చౌదరి నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన బాలకృష్ణ సినిమా ‘అఖండ’లో కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడలో మొత్తం 100 సినిమాల్లో నటించారు చలపతి. చలపతి చౌదరి.. విజయవాడకు చెందిన వారు కాగా.. రాయ్‌చూర్‌లో స్థిరపడ్డారు.