నటి జయంతికి అస్వస్థత..వెంటిలేటర్‌తో శ్వాస - MicTv.in - Telugu News
mictv telugu

 నటి జయంతికి అస్వస్థత..వెంటిలేటర్‌తో శ్వాస

July 8, 2020

jayanti

తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగి.. ఎన్నో అపురూప చిత్రాల్లో నటించిన ప్రముఖ సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్ లో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతుండడంతో మంగళవారం బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిటల్ లోచేర్పించారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది.

ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా అస్తమా సమస్యతో బాధపడుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆమెను చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటుందని ఆమె కుమారుడు కృష్ణ కుమార్‌ తెలిపారు. ఆమె ఇప్పటి వరకు 500పైగా సినిమాల్లో నటించారు. 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.