తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ముంబై నుంచి ఎంతో మంది హీరోయిన్లుగా వచ్చినా.. అందులో చాలా తక్కువ మంది మాత్రమే తరతరాలు గుర్తుండిపోయేలా ప్రభావాన్ని చూపించగలిగారు. వారిలో సీనియర్ హీరోయిన్ మీనా ఒకరు. అప్పట్లో అన్ని భాషల అగ్రహీరోలతో నటించిన మీనాకి ఇప్పడు కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది భర్తను కోల్పోయిన ఆమె కొన్నాళ్ల విరామం తర్వాత.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. భర్త మరణించిన తర్వాత మీనా కాసింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ షాక్ నుంచి తేరుకొని… వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నారు.
ప్రస్తుతం ఆమె ‘రౌడీ బేబీ’ అనే తమిళ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. అలాగే, మలయాళంలో ‘జనమ్మ డేవిడ్’ అనే సినిమాను చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు సైతం మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న మీనా.. కొంత కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్నారు. ఇందులో భాగంగానే ఎన్నో విషయాలను తన ఫ్యాన్స్‌తో షేర్ చేస్తున్నారు. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా వదులుతున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆమెతో పాటు నటి సంఘవి కూడా ఉన్నారు. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోన్న ‘ఎనిమీ’ మూవీలోని సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే, మీనాపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.