తస్సదియ్యా.. హైకోర్టు విచారణలో హుక్కా పీల్చిన లాయర్ - MicTv.in - Telugu News
mictv telugu

తస్సదియ్యా.. హైకోర్టు విచారణలో హుక్కా పీల్చిన లాయర్

August 13, 2020

Senior advocate smokes hookah during virtual hearing of Rajasthan HC, video goes viral

న్యాయవాదులు కోర్టులో చేంతాడంత వాదనలతోపాటు కుప్పల కొద్దీ నీతులు కూడా వల్లిస్తుంటారు. అయితే అవన్నీ వేరేవాళ్లకేనని, తమకు వాటితో సంబంధం లేదని అనుకుంటూ ఉంటారు కూడా. కాంగ్రెస్ గద్దె కిందికి నీళ్లు తెచ్చిన ఓ ముఖ్యమైన కేసును విచారిస్తున్న రాజస్తాన్ హైకోర్టు విచారణలో ఓ సీనియర్ న్యాయవాది చాలా తాపీగా హుక్కా పీల్చాడు. అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో నెటిజనం దుమ్మెత్తి పోస్తున్నారు. 

రాజస్తాన్‌లో బీఎస్పీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలైంది. ఈ రోజు కోర్టు వీడియోలో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌  హుక్కా గుప్పుగుప్పున వదులుతూ కనిపించాడు. కాగితాలు అడ్డంగా పెట్టుకుని పనికానిచ్చేశాడు. విచారణలో కాంగ్రెస్‌ పార్టీ  కపిల్‌ సిబాల్‌ వాదించారు.. ఇదిలా ఉండగా అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం అసెంబ్లీలోని బలం నిరూపించుకోవాని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే సచిన్ పైలెట్ బెట్టువీడడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు తప్పింది.