సహాయనటిగా, హీరో హీరోయిన్స్ కి తల్లిగా.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి సుధ. ఆమె, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో ఎమోషనల్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సుధ. ఆ తరువాత మెయిన్ లీడ్స్ కి అమ్మ పాత్రలు వేస్తూ కెరీర్ లో విరామం లేకుండా నటిస్తుంది. అయిత్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటివరకు చాలామంది స్టార్స్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పినా.. అభిమానులకి ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది. తెరపై ఎన్టీఆర్ డ్యాన్స్, ఫైట్స్, పర్ఫార్మెన్స్ కి ఫిదా కానీ స్టార్ ఉండడు. కానీ తెరవెనుక ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలాంటిదో నటి సుధ చెప్పింది. బాద్షా మూవీలో ఎన్టీఆర్ తో కలిసి నటించింది సుధ. అందులో ఒక డాన్సింగ్ నంబర్ పై ఎన్టీఆర్ తో కలిసి మాస్ స్టెప్స్ కూడా వేస్తుంది. అన్న ఎన్టీఆర్ చిత్రంలోని గీతంపై డాన్స్ వేస్తుంటే జరిగిన సంఘటనని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది సుధ.
“తారక్ సెట్ లోకి వస్తున్నాడు అంటే గోలగోల చేసేవాడు. కానీ మహిళలతో మాత్రం హుందాగా వ్యవహరిస్తాడు. ఎన్టీఆర్ చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు. బాద్ షా షూటింగ్ లో తారక్ తో కలిసి డాన్స్ చేసే సీన్ ప్రాక్టీస్ చేస్తుండగా నా కాలు స్లిప్ అయ్యి బెణికింది. వెంటనే కాలు వాచిపోయింది. అది చూసి జూనియర్ ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాలు పట్టుకుని స్ప్రే చేసి జాగ్రత్తగా కూర్చోబెట్టాటు. అంత గొప్ప స్టార్ కి అదంతా చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది చూసీ చూడనట్లు వెళ్లిపోతారు. కానీ, తారక్ అలాంటి వ్యక్తి కాదు. ఆ భగవంతుడు జూనియర్ ఎన్టీఆర్ ని చల్లగా చూడాలి” అంటూ నటి సుధ ఎమోషనల్ అయ్యారు.