నాకో వధువును వెతికిపెట్టండి..అధికారులకు 63 ఏళ్ల వృద్ధుడి అభ్యర్థన - MicTv.in - Telugu News
mictv telugu

నాకో వధువును వెతికిపెట్టండి..అధికారులకు 63 ఏళ్ల వృద్ధుడి అభ్యర్థన

February 3, 2020

hvbgbd

మనమలు, మనవరాళ్ళకు పెళ్లి సంబంధాలను చూడాల్సిన వయసులో ఓ వృద్ధుడు తనకు తోడు కోసం అధికారులకు అభ్యర్థన పెట్టుకున్నాడు. పంచాయతీ ఆఫీసుకు వెళ్లి తనకో సరిజోడిని చూసి పెట్టాలని విన్నవించుకున్నాడు.కర్నాటకలోని హవేరీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ దరఖాస్తుకు కొంత మంది గ్రామస్తులు మద్దతు తెలపగా.. దీన్ని అధికారులు స్వీకరించి రసీదు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

hvbgbd

నరేగల్ గ్రామానికి చెందిన ధ్యామన్న కమ్మర్ అనే వ్యక్తి దయామవ మందిరానికి పూజారిగా పని చేస్తున్నాడు. ఆయనకు  చాలా కాలంగా పెళ్లి కావడం లేదు. 40 ఏళ్లుగా అమ్మాయి కోసం పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. అలా వెతుకుతూ.. వెతుకుతూ.. ఆయనకు 63 ఏళ్లు వచ్చాయి. వృద్దాప్యం రావడంతో ఒంటరి జీవితానికి విసుగు చెందాడు. దీంతో అధికారులకు ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందులో ‘నాకు ఆహారం వండడానికి ఎవరూ లేరు. అందువల్ల నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.నా సొంత కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా. దయచేసి సరైన అమ్మాయిని వెతికి పెట్టండి అంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. దీన్ని స్వీకరించిన అధికారులు అతనికి దరఖాస్తు తీసుకున్నాడు.