Senior Congress leader Marri Shasidhar Reddy shall join BJP
mictv telugu

కాంగ్రెస్‌‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి!

November 16, 2022

Senior Congress leader Marri Shasidhar Reddy shall join BJP

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడుగా వెళ్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటూ అధికార పార్టీకి ధీటైన సంకేతాలు పంపుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన కాషాయం పార్టీ.. ఇప్పటికే డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా, తాజాగా సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీలోకి చేరుతున్నారని సమాచారం. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరతారని చెప్తున్నారు.

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్‌లకు అధిష్టానం ఢిల్లీ ఆహ్వానించగా, వారితో పాటు డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డిలు కూడా హస్తినకు పయనమయ్యారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే బీజేపీలో చేరగా, మర్రి శశిధర్ రెడ్డి చేరబోతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పరిస్థితికి రేవంతే కారణమని, ఆయన చేస్తున్న పనులతో పార్టీకి నష్టం చేకూరుతుందని మండిపడ్డారు. అంతేకాక, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ సైతం రేవంత్‌‌కు ఏజెంటుగా మారారని ఆరోపించారు. అటు వచ్చే సాధారణ ఎన్నికల్లో సిట్టింగులకే మళ్లీ టిక్కెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో బీజేపీకి వరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దెబ్బతో టిక్కెట్లు ఆశిస్తున్న గులాబీ నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరే అవకాశముందని, దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ సారి అభ్యర్ధులను నిలబెట్టవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. తద్వారా అభ్యర్ధుల కొరతను అధిగమించినట్టవుతుందని ఆ పార్టీ ఆలోచనగా చెప్తున్నారు.