మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్న వారు.. కాలానుగుణంగా మారాలి. మా కాలంలో మేం అలా చేశాం, ఇలా తీశాం అని గొప్పలకు పోతే నలుగురిలో నవ్వులపాలు కాకమానరు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విషయంలో ఇదే జరిగింది. దర్శక దిగ్గజం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు.. కేవలం ప్రమోషన్ల కోసమే దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిందని, అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్లకు గానూ అంతగా ఖర్చు పెడుతున్నారంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆ 80 కోట్లు తనకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతామంటూ రెచ్చిపోయి అందరి ముందు మాట్లాడాడు. ఈ కామెంట్లపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముకుల నుంచి సైతం విమర్శల వర్షం కురుస్తోంది.
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023
తాజాగా ఇదే విషయంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. మిత్రుడు భరద్వాజకి అంటూ మొదలు పెట్టిన ఆయన తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి, అంతేగాని 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా..? హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా డబ్బు తీసుకొని ‘ఆర్ఆర్ఆర్’చిత్రం గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా..? అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
To Whomever It May Concern :
“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం"
(#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2023
మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ కామెంట్లపై స్పందిస్తూ తనదైన స్టైల్ లో కౌంటర్ వేశారు. నీ…ఖర్చుపెట్టడారా 80కోట్లు RRR కి ఆస్కార్ కోసం అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యారు నాగబాబు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరి దీని పై తమ్మారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.