సీనియర్ సినీ ఎడిటర్ గౌతంరాజు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సీనియర్ సినీ ఎడిటర్ గౌతంరాజు మృతి

July 6, 2022

తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన 850 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి, సినీ పరిశ్రమలో తనకంటూ చెరిగిపోని ముద్ర వేసుకున్న సీనియర్ ఎడిటర్ గౌతం రాజు (68) గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారన్న వార్త తెలిసిన వెంటనే సినీ వర్గాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి. గౌతం రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు.

గౌతం రాజు.. 15 జనవరి 1954లో మద్రాసులో గౌతంరాజు జన్మించారు. 1982లో ‘దేఖ్ఖబర్ రఖ్ నజర్’ అనే సినిమాతో ఎడిటింగ్ కెరిర్‌ను ప్రారంభించారు. ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నాంది అవార్డును అందుకున్నారు. సినీ ఎడిటర్‌గా ఆయన సుమారు 850 పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. ‘ఆది’ ‘ఖైదీ నెంబర్ 150’, ‘గబ్బర్ సింగ్, ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’ ‘అదుర్స్’, ‘బలుపు’, ‘రచ్చ’, ‘ఊసరవెల్లి’, ‘బద్రీనాథ్, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘కాటమరాయుడు’ తదితర ప్రాజెక్ట్ లతో ఆయన సినీ ప్రేక్షకుడి మదిని గెలుచుకున్నారు.