వినోదం, విజ్ఞానం అందించేందుకే.. నటి శోభన - MicTv.in - Telugu News
mictv telugu

వినోదం, విజ్ఞానం అందించేందుకే.. నటి శోభన

September 29, 2018

అక్కినేని నాగార్జున ‘విక్రమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, అందరి మనసులు దోచేసిన నటి పద్మశ్రీ శోభన.

అగ్రహీరోలతో అనేక సినిమాలు చేసిన ఆమె మంచి విజయాలు సాధించారు. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న శోభన ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.‘జాదూజ్’ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న పద్మశ్రీ శోభన.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ‘ టి. ఫైబర్’ తో కలిసి రంగారెడ్డి జిల్లా తూములూరు గ్రామంలో ‘జాదూత్ సెంటర్’ ప్రాజెక్టు ప్రారంభించారు. దీనిక ద్వారా సామాన్యులకు దూరమైన సినిమాను మళ్లీ వారికి అందుబాటులోకి తీసుకురావలనే ఉద్దేశంతో జాదూజ్  ఈ కార్యక్రమం ప్రారంభించింది.Senior Heroine Shobana Special Program In Telangana Villages తెలంగాణాలోని 8వేల గ్రామాల్లో ప్రజలకు ఈ సెంటర్స్ ద్వారా వినోదం, విజ్ఞానాన్ని అందిచనున్నారు. అయితే తొలి విడతగా 500 గ్రామాల్లో జాదూజ్ సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు ప్రాణాళికలు రూపొందించారు. ఈ సెంటర్స్‌లో “చాయ్ నాస్తా కేఫ్”లు కూడా ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా వంద మిలియన్ డాలర్ల (సుమారు 700 కోట్ల) ఆదాయంతోపాటు.. ఆరువేల మందికి ఆదాయం రానుంది.