ప్రజల మేలు కోరినందుకు ఐఏఎస్‌పై వేటు.. కంపెనీలు, మంత్రులు కలిసి... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజల మేలు కోరినందుకు ఐఏఎస్‌పై వేటు.. కంపెనీలు, మంత్రులు కలిసి…

May 12, 2020

Senior IAS officer Manivannan shunted out without new posting

కరోనా లాక్‌డౌన్‌లో సామాన్యులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్న ఐఏఎస్ అధికారిపై బదిలీవేటు పడింది. కంపెనీలు లాక్ డౌన్ తో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నందుకు, ఇవ్వని కంపెనీలకు నోటీసులు జారీ చేసినందుకు ఆయనపై కక్షగట్టి  గట్టి  ప్రతీకారం తీర్చుకున్నారు. కర్ణాటక కార్మిక శాఖ కార్యదర్శ మణివణ్ణన్ నిజాయితీకి పెట్టింది పేరు. 

లాక్‌డౌన్ కారణంగా జీతాలు ఇవ్వడం లేదని ఆయనకు వందలాది ఫిర్యాదులు వచ్చాయి. ఒక్కరోజులోనే 700 ఫిర్యాదు వచ్చాయి.  కార్మికులు, చిరుద్యోగులు ఆయనకు మొరపెట్టుకున్నారు. దీంతో ఆ కంపెనీలకు నోటీసులు సిద్ధమయ్యాయి. మరోపక్క.. ఆయన కరోనాపై పోరాటం కోసం కోవిడ్ వారియర్స్ టీంను ఏర్పాటు చేశాడు. వలంటీర్ల సాయంతో కార్మికులను ఆదుకుంటున్నారు. అంతేకాకుండా తప్పుడు వార్తను పసిగట్టి అవగాహన కల్పిస్తున్నారు. ఇదంతా గిట్టనివాళ్లు పావులు కదిపారు. మణివణ్ణన్ పై బదిలీవేటు వేసి పోస్టింగ్ ఇవ్వకుండా వెయింటింగ్ లో పెట్టింది ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి మహేశ్వర్ రావుకు పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బ్రింగ్ బ్యాక్ మణివణ్ణన్ పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతో ప్రచారం చేస్తున్నారు. కంపెనీలు, మంత్రులు కుమ్మక్కయారని ఆరోణపలు వస్తున్నాయి.