సీనియర్ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కైకాల.. పరిస్థితి విషమించి ఫిల్మ్ నగర్లోని తన నివాసంలోనే కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. పరిస్థితి సీరియస్ గా ఉందని ఆ కుటుంబ సభ్యులు.. డాక్టర్లకు సమాచారం ఇవ్వగా.. ఆయనకు ఇంటి దగ్గరే చికిత్స ప్రారంభించారు. అయినా కూడా ప్రాణాలు దక్కలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు చేసిన వారు చేసిన ప్రార్ధనలు ఫలించలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఆయన మరణం పెద్ద షాకింగ్ న్యూసే. ఆయన మృతితో యావత్ సినీ ప్రపంచం కన్నీరు మున్నీరవుతోంది. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం 11 నుంచి ఫిల్మ్ నగర్లో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లు చెప్పారు.
1935 జులై 25 న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల.. 1959లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్నో పౌరాణిక,జానపద, సాంఘీక చిత్రాల్లో 777 సినిమాలకు పైగానే నటించారు. ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 86 ఏళ్ళ కైకాల కొన్ని రోజుల కింద ఇంట్లో జారి పడిపోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కాస్త దెబ్బతింది. 60 ఏళ్ళ నటప్రస్థానంలో ఆయన చేసిన పాత్రలు మరెవ్వరూ చేయలేదు.