Sensational decision of ABN Radhakrishna..Rs. 10 crore reputation loss on Madhav
mictv telugu

ABN రాధాకృష్ణ సంచలన నిర్ణయం..మాధవ్‌పై రూ.10 కోట్ల ప‌రువు న‌ష్టం

August 10, 2022

Sensational decision of ABN Radhakrishna..Rs. 10 crore reputation loss on Madhav

ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రూ. 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేయడానికి సిద్దమైయ్యారు. చట్టపరంగా క్రిమినల్, పరువు నష్టం చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరనున్నారు.

అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో ఆయన కాసేపటిక్రితమే వెల్లడించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశంలో ప్రకటించిన తర్వాత కూడా మాధవ్..ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, తనపై తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడాడని, ఆ వ్యాఖ్యలను తనను తీవ్రమైన బాధకు గురిచేశాయని, అందుకే ఈ నిర్ణయానికి రెడీ అయ్యానని ఆయన తెలిపారు.

మరోవైపు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంలో బుధ‌వారం ప‌లు కీల‌క మ‌లుపులు చోటుచేసుకున్నాయి. ఆ వీడియో ఒరిజిన‌ల్ కాద‌ని అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప మీడియా ముందు వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన ప్ర‌క‌ట‌న‌ను ఎంపీ మాధ‌వ్ ఆహ్వానించారు కానీ, టీడీపీ నేత‌లు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

అయితే, వీడియోను తొలుత ప్ర‌సారం చేసిన ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌, దాని య‌జ‌మాని వేమూరి రాధాకృష్ణ‌పై ఇదివ‌ర‌కే ఎంపీ మాధ‌వ్ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈరోజు మరోసారి ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహంతో తీవ్రమైన పదజాలంతో ఏబీఎన్ ఛానెల్‌ను, ఎండీ రాధాకృష్ణను దూషించారు. ఈ క్రమంలో మాధవ్‌పై పరువు నష్టం దావా వేయడానికి రాధాకృష్ణ సిద్దమైయ్యారు.