Sensational decision of RBI..reporate increase again
mictv telugu

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం..రెపోరేటు మళ్లీ పెంపు

August 5, 2022

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే రేపో రెటును మళ్లీ పెంచుతూ, కాసేపటిక్రితమే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈసారి వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చినట్లు ప్రకటించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు 35 బేసిస్ పాయింట్లు కాకుండా ఆర్‌బీఐ మరింత అధిక పెంపునకు మొగ్గుచూపింది.

కొవిడ్ తర్వాత ఆర్‌బీఐ వరుసగా మూడోసారి రెపోరేటును పెంచింది. మే నెలలో 40 బేసిస్ పాయింట్లు.. జూన్‌లో 50 పాయింట్లు, ప్రస్తుతం .40 శాతానికి పెంచింది. ఈ క్రమంలో తాజా మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదాలు మరింత భారం కానున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు.. వృద్ధికి సహకారం అందించేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్‌బీఐ గత సమీక్షలోనే తెలిపింది.