Sensational decision of Telangana government.. Now Rs. 3 thousand
mictv telugu

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై రూ.3 వేలు

August 6, 2022

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకపై నార్మల్ డెలివరీలు చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. నార్మల్ డెలివరీలకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం అధికారులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే పలు సభల్లో పలుమార్లు వివరించారు. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి వైద్య అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, సాధారణ ప్రసవాలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. అనంతరం సాధారణ ప్రసవాలను మరింతంగా ప్రోత్సహించేందుకు ‘టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్’ పేరుతో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో జరిగే ప్రతి సాధారణ ప్రసవానికి రూ.3 వేలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నిధులను ప్రతి నెల సూపరింటెండెంట్‌కు విడుదల చేస్తామని తెలిపారు.

మరోపక్క సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద, ధనిక, వర్గం అనే తేడా లేకుండా మహిళలు డెలివరీలు అయితే వారికి ‘కేసీఆర్ కిట్‌’ను అందిస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేద ప్రజల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఇక నుంచి వైద్యులు సాధారణ డెలివరీలు చేస్తే, వారికి రూ. 3వేల రూపాయలను అందజేస్తామని ప్రకటించారు.