‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. వర్మ కొత్త సినిమా - MicTv.in - Telugu News
mictv telugu

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. వర్మ కొత్త సినిమా

May 26, 2019

Sensational Director Ram gopal Varma Says His New Movie Name.

వివాదాస్పద డైరెక్టర్‌గా తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాంగోపాల్ వర్మ. విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇప్పటికే ‘రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాలు తీసి వర్మ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన వర్మ తన కొత్త సినిమా పేరును ప్రకటించి సంచలన సృష్టించారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వర్మ.. తన తదుపరి సినిమాలను కూడా అదే తరహాలో తీయనున్నట్లు ప్రకటించారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో వర్మ కొత్త సినిమా తీస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు సామాజిక వర్గాల నడుమ జరిగే రాజకీయ పోరే ఈ సినిమా కథాంశాన్ని వర్మ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ జీవితంలో చివరి దశలో ఎవరి వలన కష్టాల పాలయ్యారు, ఎలాంటి నరకయాతనను అనుభవించారో చెప్పడానికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేశాను.  సినిమాను విడుదల కానివ్వకుండా చేసి నన్ను విజయవాడలో అరెస్ట్ చేశారు. సినిమా విడుదలకు ముందే బాబుకు శిక్ష పడింది’ అంటూ వర్మ వ్యాఖ్యానించారు.