రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘అబ్దుల్లాపూర్‌మెట్ హత్య’ కేసులో ఆశ్చర్యపోయే విషయాలు బయట పడుతున్నాయి. హత్యకు ప్రధాన కారణం ప్రేమ వ్యవహరమే కాగా.. ఆ యువతి ఇద్దరు స్నేహితులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. హరిహర కృష్ణ తన స్నేహితుడిని దారుణంగా హతమార్చడానికి… కేవలం కక్ష ఒకటే కారణం కాదని, గంజాయి మత్తులోనే అతడు ఘాతుకానికి పాల్పడి ఉంటాడని.. అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హత్య చేసిన హరిహర కృష్ణ .. విషయాన్ని బ్రాహ్మణపల్లికి చెందిన స్నేహితుడు హసన్‌కు, ప్రేమించిన యువతికి… చెప్పాడు. అతి కిరాతకమైన ఈ హత్య గురించి తెలిసినా.. వీరిద్దరు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అంతా తెలిసిపోయాకు కూడా ఈ కేసులో విచారణకు ఆ ముగ్గురు కూడా సహకరించడం లేదని పోలీసులు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు హరిహరకృష్ణకు షెల్టర్ ఇచ్చిన హసన్‌ను విచారించారు. యువతిని ప్రశ్నించేందుకు సిద్దం కాగా.. ఈ కేసులోకి తనను లాగితే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించినట్టు తెలుస్తోంది.సఖి సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇప్పించినా విచారణకు సహకరించకపోవడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది.
నిందితుడిని 8 రోజుల కస్టడీ కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఎల్బీనగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్చన్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు వివరించారు. హరిహరకృష్ణ కస్టడీపై ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. హత్య గురించి తెలిసినా.. వారు ఎందుకు బయటకు చెప్పలేదనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.