మాస్కులు డాక్టర్లకు,  మనకు చున్నీలు.. విజయ్ దేవరకొండ - MicTv.in - Telugu News
mictv telugu

మాస్కులు డాక్టర్లకు,  మనకు చున్నీలు.. విజయ్ దేవరకొండ

April 7, 2020

Sensational hero says leave masks, use kerchief!

రాకెట్ స్పీడులో వ్యాప్తి  చెందుతున్న కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మాస్క్‌లు, శానిటైజర్లు వాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయమై యువహీరో విజయ్ దేవరకొండ ట్విటర్ వేదికగా స్పందించాడు. ప్రజలందరూ మాస్క్‌లు వాడితే.. ప్రజలను కాపాడే వైద్యులకి మాస్క్‌ల కొరత ఏర్పడే అవకాశముందని ట్వీట్ చేశాడు. చాలా రోజుల తర్వాత ట్విట్టర్‌లో స్పందించిన విజయ్ మాస్కులకు బదులు వేరే వాటిని వాడాల్సిందిగా పేర్కొన్నాడు. ‘నేను ప్రేమించే మీరంతా సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నాను. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు బట్టతో ముఖాన్ని కవర్ చేసుకోండి. మెడికల్ మాస్క్‌లను వైద్యుల కోసం వదిలేయండి. వాటి ప్లేస్‌లో రుమాలు, కండువా లేదంటే మీ అమ్మ వాడే చున్నీతో ఫేస్ కవర్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి’ అని తెలిపాడు. 

మాస్క్ ఇండియా అని ట్యాగ్ చేసి, రుమాలుతో ఫేస్ కవర్ చేసుకున్న ఫోటోని పంచుకున్నాడు. విజయ్ ట్వీట్ పై ఆయన అభిమానులు స్పందిస్తున్నారు. ‘మంచి ఐడియా చెప్పావు భయ్యా’ అని ఒకరు.. ‘అవును ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యులే దేవుళ్లు. వాళ్లకు మనం అండగా నిలవాల్సిన పరిస్థితి ఇది. మాస్కులకు బదులు మనం రుమాలు వాడటమే కరెక్ట్’ అని మరో యూజర్ కామెంట్ చేశారు. కాగా, కరోనాతో ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రజలంతా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉండి ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు.