ఉత్కంఠ పోరులో భారత్‌పై బంగ్లాదేశ్ విజయం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్కంఠ పోరులో భారత్‌పై బంగ్లాదేశ్ విజయం..

December 4, 2022

బంగ్లాదేశ్‌పై భారత్ అనూహ్య పరాభవం చవిచూసింది. ఉత్కంఠ బరితంగా సాగిన మొదటి వన్డేలో టీం ఇండియా ఓటమి పాలయ్యింది. ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి అనూహ్యంగా పుంజుకుని చివరిలో తుస్సుమనిపించింది. ఒక్క వికెట్ తీయలేక గెలుపు ముందు బొక్క బోర్లా పడింది. భారత్ నిర్దేశించిన 187 పరుగల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చేధించింది. అద్భుత పోరాటంతో మెహిదీ హసన్ మిరాజ్ (41 పరుగులు) భారత్‌కు మ్యాచ్‌ను దూరం చేశాడు.

భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాకు తొలిబంతికే షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్ షాంటో.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మొదటి బంతికే అవుటయ్యాడు. తర్వాత ఎ.హక్ కూడా తొందరగానే పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో మూడో వికెట్‌కు లిటన్ దాస్(41), షకీబుల్ హసన్(29)లు 48 పరుగులు జోడించారు.తర్వాత లిటన్ దాస్ ఔటవ్వడం, కోహ్లీ పట్టిన క్యాచ్‌కు షకీబుల్ పెవిలియన్‎కు చేరడంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. తర్వాత వచ్చిన బంగ్లా బ్యాటర్లు వరుస ఔటవ్వడంతో భారత్ విజయం అంతా ఖాయమనుకున్నారు. అయితే చివరి వికెట్‌కు ముస్తిఫిజర్ (10) సాయంతో మెహిదీ హసన్ చెలరేగి బంగ్లాదేశ్ విజయాన్ని అందించాడు. వీరిద్దరు లాస్ట్ లో 51 పరుగల భాగ్యస్వామ్యం అందించడం విషేషం.భారత్ బౌలర్లలో సిరాజ్ 3, కుల్దీప్ సేన వాషింగ్టన్ సుందర్ రెండేసి, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ పేలవ ప్రదర్శన చేసింది. 41.2 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) మినహా అంతా విఫలమయ్యారు. భారత్‌ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లోనే ఓపెనర్ శిఖర్ ధావన్(7)ను మెహ్‌దీ హసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరడంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జట్టను కాసేపు శ్రేయస్ అయ్యర్ (24), కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శ్రేయస్ అవుట్ అవ్వడం.. సుందర్ (19)కాసేపు నిలిచినా భారీ స్కోరు చేయలేకపోవడంతో భారత్ ఇన్నింగ్స్ కుదేలైంది.
తర్వాత బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోవడంతో చివరికి 186 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.ఒంటరిపోరాం చేసిన రాహుల్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్‌హసన్(5/36) ఐదు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా… ఈబాడట్ హోస్సెన్(4/47) నాగులు వికెట్లతో సత్తా చాటాడు. మెహ్‌దీ హసన్‌కు ఓ వికెట్ దక్కింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ముందడగు వేసింది.