దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా ఆరు రోజులుగా లాభాలతో కొనసాగుతున్నాయి. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ కీలక సూచీలు ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసుకున్నాయి. నిఫ్టీ అన్నింటికన్నా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లూ లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, టెక్ ఎం, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సీఎల్ లు టాప్ లో ఉంటే బజాజ్ ఆటో, యూపీఎల్, ఐషర్ మోటార్స్, హెచ్యూఎల్, సిప్లాలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 395 పాయింట్ల ఎగిసి 63484 దగ్గర, నిఫ్టీ 103 పాయింట్లతో 18862 దగ్గర ప్రారంభమై నిలకడగా కొనసాగుతున్నాయి.ఇదిలాగే కొనసాగితే మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి మరిన్ని లాభాలు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.