ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

December 20, 2021

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో కొత్త ఇన్వెస్టర్లు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రధాన కారణాలుగా ప్రపంచమంతటా రోజు రోజుకు వేగంగా వ్యాప్తిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ప్రభావమేనని చెప్పవచ్చు.

ఈ మహమ్మారి కారణంగా కొత్తగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారు భయాందోళనకు గురౌతున్నారు. ప్రస్తుతం ఒక వైపు ఒమిక్రాన్ కేసులు పెరగడం, పలు దేశాల్లో లాక్‌డౌన్ ప్రభావం వంటి అంశాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, దేశీయ మార్కెట్లు సైతం కుదేలైయ్యాయి. 1,189 పాయింట్ల వరకు సెన్సెక్స్ నష్టపోయింది. దీంతో 371 పాయింట్లను నిఫ్టీ కోల్పోయింది. 5 శాతానికి పైగా టాటా స్టీల్, 4 శాతానికి పైగా ఇండస్ ఇండ్ బ్యాంక్, 3 శాతానికి పైగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీలు నష్టపోయాయి.