Home > Business Trends > స్టాక్ మార్కెట్లు రికార్డ్..32 వేల మార్క్ క్రాస్..!

స్టాక్ మార్కెట్లు రికార్డ్..32 వేల మార్క్ క్రాస్..!

భారత స్టాక్ మార్కెట్లు మరో చరిత్ర సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారి 32 వేల పాయింట్ల మార్క్‌ను తాకింది. గురువారం ఉద‌యం స్టాక్ మార్కెట్‌ లాభాల‌తో ప్రారంభ‌మైంది. సెన్సెక్స్ 200కుపైగా పాయింట్ల‌కు పైగా లాభ‌ప‌డ‌టంతో తొలిసారి 32 వేల మార్క్‌ను అందుకుంది. అటు నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 9881 పాయింట్ల ద‌గ్గ‌ర ట్రేడ్ అయింది. జూన్ నెల‌ ద్ర‌వ్యోల్బ‌ణం 1.54 శాతానికి ప‌డిపోయింద‌న్న ప్ర‌భుత్వ అంచ‌నాల‌తో సెన్సెక్స్ ప‌రుగులు పెట్టింది. గ‌త ఐదేళ్ల‌లో ద్రవ్యోల్బ‌ణం ఇంత త‌క్కువ‌గా న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. అటు ఆర్బీఐ త‌న త‌ర్వాతి స‌మీక్ష‌లో కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌నుంద‌న్న వార్త‌లు మార్కెట్‌కు క‌లిసి వ‌చ్చాయి. ఆర్బీఐ రేట్లు త‌గ్గిస్తుంద‌న్న స‌మాచారంతో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు బాగా లాభ‌ప‌డ్డాయి.

Updated : 13 July 2017 2:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top