దళితులకు ప్రత్యేక దేశం కావాలి.. జేడీయూ నేత డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

దళితులకు ప్రత్యేక దేశం కావాలి.. జేడీయూ నేత డిమాండ్

April 9, 2018

దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యేక దేశం కావాలని బిహార్ మాజీ మంత్రి, సీనియర్ దళిత నేత రామాయ్ రాం డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ఆశించిన ప్రత్యేక ‘హరిజనిస్తాన్’ కోసం తాను త్వరలో ఉద్యమాన్ని లేవనెత్తుతానని హెచ్చరించారు. దళితుల హక్కులను కాపాడ్డంలో కేంద్రం, రాష్ట్రాలు విఫలమైంతే ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం ఉద్యమమే శరణ్యమని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యానికి ముందు ప్రత్యేక పాకిస్తాన్, హరిజనిస్తాన్ డిమాండ్లు ఉండేవి. పాకిస్తాన్ ఏర్పాటైంది. కానీ హరిజస్తాన్ కల సాకారం కాలేదు. ఎస్సీలు గౌరవప్రదంగా జీవించే వాతావరణాన్ని కల్పిస్తామని, అందుకు రాజ్యాంగ నిబంధనలు తెస్తామని అప్పటి దేశనాయకులు అంగీకరించిన తర్వాతే అంబేడ్కర్ నెహ్రూ కేబినెట్‌లో చేరారు. కానీ ఇప్పుడు ఆ నిబంధనలను నీరుగారుస్తున్నారు..’ అని రామాయ్ రాం ఆరోపించారు.