ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రాల డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధానిగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. టీడీపీ నేత చంద్రబాబుపై విమర్శలు సంధిస్తూ ఆయన ఇలా స్పందించారు. ‘‘చంద్రబాబుకు అధికారం తప్ప మరో లక్ష్యం లేదు.
ఆయన ఇంకా అమరావతే రాజధాని అంటున్నాడు. మన వేళ్లతో మన కళ్లనే పొడుస్తున్నాడు. మాకు అమరావతి వద్దు. మా విశాఖను మాకు ఇవ్వండి. వైగాజ్ రాజధానిగా ఒక చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మాకు తోచినట్లు మాకు చేతనైనట్లు ఎలాగోలా పాలించుకుంటాం’’ అని ధర్మాన అన్నారు. వైకాపా ప్రభుత్వ పనితీరు చక్కగా ఉండడంతో బాబుకు జీర్ణం కావడం లేదని మండిపడ్డాడు. శ్రీకాకుళం జిల్లా బొంతలకోడూరులో జరిగిన కార్యక్రమంలో ధర్మాన ప్రసంగించారు. ప్రజలు ఇంకోసారి టీడీపీని నమ్మి మోసపోవొద్దని, చంద్రబాబు ముసలివాడైన నడవలేకపోతున్నాడని విమర్శించారు.