జల్సాల కోసం దొంగగా మారిన సీరియల్ నటుడు - MicTv.in - Telugu News
mictv telugu

జల్సాల కోసం దొంగగా మారిన సీరియల్ నటుడు

December 10, 2019

Serial Actor01

జల్సాల కోసం ఓ యువకుడు దొంగగా మారాడు. లగ్జరీ జీవితం కోసం ఇళ్లలో చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

వికా‌స్‌నగర్‌కు చెందిన బలిజ విక్కీ(28) తెలుగులో వచ్చే టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంటాడు. 2018లో నటనలో అవకాశం కోసం డబ్బు అవసరం కావడంతో దొంగగా మారాడు. అదే అలవాటు చేసుకొని సీరియల్స్‌లో నటిస్తూ జల్సాల కోసం చోరీలు కొనసాగిస్తూ వస్తున్నాడు. గతంలోనూ విక్కీపై పలు కేసులు నమోదు అయ్యాయి. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. మరోసారి దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కాడు.