హైదరాబాద్‌కు వస్తున్న బస్సులో మంటలు.. ఏడుగురి దుర్మరణం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌కు వస్తున్న బస్సులో మంటలు.. ఏడుగురి దుర్మరణం

June 3, 2022

కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీని ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు సమాచారం. బస్సులో డ్రైవర్తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 12 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. బీదర్-శ్రీరంగపట్టణం హైవేపై కమలాపుర వద్ద శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. మృతులంతా హైదరాబాద్కు చెందినవారేనని సమాచారం. బస్సును ఆరెంజ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.