7 పడగల పాము మళ్లీ వచ్చిందోచ్.. పోటెత్తిన జనం..  - MicTv.in - Telugu News
mictv telugu

7 పడగల పాము మళ్లీ వచ్చిందోచ్.. పోటెత్తిన జనం.. 

October 10, 2019

ఉండాల్సిన దానికన్నా భిన్నంగా ఉంటే ఆసక్తి రేగడం సహజం. మనిషి అయినా, పాము అయినా, కప్ప అయినా తేడాగా కనిపించే జనం పోటెత్తుతారు. కర్ణాటకలో కొన్నాళ్ల కింద కలకలం రేపిన ‘ఏడు పడగల’ మళ్లీ కనిపించాడు. ఈసారి కూడా అదే కర్ణాటకలో అదే కనకపుర ప్రాంతంలో కుబుసం విడిచి వెళ్లిపోయాడు. ఈ వింత చూడ్డానికి జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. బుధవారం బాలప్ప అనే రైతు పొలానికి దగ్గర్లోని గుడి సమీపంలో కొన్ని కుబుసాలు బయటపడ్డాయి. అవన్ని తలభాగంలో ఉండడంతో అది ఏడు తలల పాము వదిలిన కుబుసం అని భావిస్తున్నారు. 

అయితే కొన్ని పాములు వదిలిన కుబుసాలని, ఏడు తలల పాము ఈ లోకంలో లేదని హేతువాదులు కొట్టిపడేస్తున్నారు. పాములకు జన్యు కారణాల వల్ల రెండు తలలు ఉంటే వుండొచ్చుగాని, అంతకుమించిన తలలు ఉండవని, ఒకవేళ్ల పుట్టినా అవి బతికి బట్టకట్టవని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కనకపురలో ఏడు పడగల పాములను చూశామని గతంలోనూ కొందరు చెప్పారు. పొలానికి వెళ్తుండగా అలాంటి పాము కనిపించిందని కోటెకొప్ప గ్రామానికి చెందిన దొడ్డ కెంపేగౌడ తెలిపాడు.